Header Banner

వరుసగా రెండోసారి ఏటీఎఫ్ ధర తగ్గింపు! వారికి మాత్రమే మినహాయింపు..!

  Thu May 01, 2025 15:21        Politics

ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు వినియోగదారులకు కొంత ఊరటనిచ్చాయి. హోటళ్లు, రెస్టారెంట్లు వంటి వ్యాపారాల్లో వినియోగించే 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్‌ ధరను తగ్గించాయి. అదే సమయంలో విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరలను కూడా సవరించాయి. అయితే, ఇళ్లలో వాడే గృహ వినియోగ సిలిండర్ల ధరల్లో ఎటువంటి మార్పు చేయలేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల్లో కదలికలకు అనుగుణంగా చమురు సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. తాజా సవరణ ప్రకారం, వాణిజ్య అవసరాలకు ఉపయోగించే ఒక్కో ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ. 14.50 మేర ధర తగ్గింది. ఈ తగ్గింపుతో హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వాణిజ్య సంస్థల నిర్వహణ వ్యయం స్వల్పంగా తగ్గనుంది. కాగా, సాధారణ ప్రజలు ఇళ్లలో వినియోగించే 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధర యథాతథంగా కొనసాగుతుందని కంపెనీలు స్పష్టం చేశాయి.

విమానయాన రంగానికి కూడా చమురు కంపెనీలు సానుకూల వార్తను అందించాయి. విమానాల్లో ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరలను కూడా తగ్గించాయి. దేశ రాజధాని ఢిల్లీలో కిలోలీటర్ ఏటీఎఫ్ ధరపై 4.4 శాతం కోత విధించాయి. దీనివల్ల కిలోలీటర్‌కు రూ. 3,954 మేర ధర తగ్గింది. తాజా తగ్గింపుతో ఢిల్లీలో కిలోలీటర్ ఏటీఎఫ్ ధర రూ. 85,486.80కి చేరింది. ఏటీఎఫ్ ధరలు తగ్గడం ఇది వరుసగా రెండో నెల కావడం గమనార్హం. గత నెలలో, అంటే ఏప్రిల్ 1న కూడా చమురు కంపెనీలు ఏటీఎఫ్ ధరలను కిలోలీటర్‌పై 6.15 శాతం (రూ. 5,870) మేర తగ్గించాయి. వరుసగా రెండు నెలల పాటు ధరలు తగ్గడంతో విమానయాన సంస్థలకు కొంతమేర నిర్వహణ ఖర్చులు తగ్గే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: ఆ ప్రాంతం లో మరో రెండు రైల్వే లైన్లుకు శ్రీకారం! కేంద్రంతో కీలక చర్చలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..

 

అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ‌ చిన్న పని తో..

 

కొత్త రేషన్ కార్డులపై శుభవార్త చెప్పిన మంత్రి.. ప్రతి కుటుంబానికి ఉచితంగా - తాజాగా కీలక ప్రకటన!

 

6 లైన్లుగా రహదారిడీపీఆర్‌పై కీలక అప్డేట్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

సీఐడీ క‌స్ట‌డీలో పీఎస్ఆర్ - మూడో రోజు కొనసాగుతున్న విచారణ! 80కి పైగా ప్రశ్నలు..

 

స్కిల్ కేసు లో చంద్రబాబుని రిమాండ్ చేసిన న్యాయమూర్తి! న్యాయ సేవా అధికార సంస్థ సభ్య కార్యదర్శిగా నియామకం! ప్రభుత్వం జీవో జారీ!

 

మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?

 

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #ATFPriceCut #AviationFuel #FuelPrices #AviationRelief #OilCompanies #JetFuel #ATFUpdate